అటవీ ప్రాంతం నుంచి హైవే దాటిన చిరుత పులి

54చూసినవారు
అటవీ ప్రాంతం నుంచి హైవే దాటిన చిరుత పులి
13 రోజులుగా దివాన్‌ చెరువు రిజర్వ్‌ ఫారెస్ట్‌లో సంచరిస్తున్న చిరుత మంగళవారం అటవీ ప్రాంతం నుంచి హైవేను దాటింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుత పులిని పట్టుకునేందుకు 79 ట్రాప్ కెమెరాలు, 8 బోనులు ఏర్పాటు చేశారు. రాజమండ్రి నుంచి విశాఖ వెళ్లే జాతీయ రహదారి పై ఉదయం 5:30 వరకు దీని సంచారం ఉంది. అటవీ ప్రాంతంలో అమర్చిన ఓ బోను వద్దకు వచ్చి అక్కడి నుంచి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్