రాజానగరం మండలం నందరాడ గ్రామంలో రెండిళ్లలో బంగారం, నగదును దొంగలు చోరీ చేశారు. సూర్యప్రకాశరావు సోమవారం కుటుంబ సభ్యులతో ఊరు వెళ్లి గురువారం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలోని 10 కాసుల బంగారం, నగదు చోరికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోనే నివసిస్తున్న సోదరిడి ఇంట్లోని దొంగలు పడి నగలు, నగదు అపహరించారని బాధితుల ఫిర్యాదుపై కేసులు నమోదు చేశామని ఎస్సై మనోహర్ తెలిపారు.