సీతానగరం మండల కేంద్రం నుంచి ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న బోట్ పాయింట్ వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, అభివృద్ధి చేయాలి అని పర్యాటక బోట్ల యజమానులు సోమవారం కోరారు. ప్రతిరోజు పాపికొండల విహారయాత్రకు చాలామంది పర్యాటకులు వెళుతున్నారని, అధికారులు వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు.