రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. కలెక్టర్ మహేష్ కుమార్ దంపతులకు దేవస్థానం అధికారులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. మహేష్ కుమార్ ఆలయం లోపలికి ప్రవేశించే సమయంలో ముఖ ద్వారం వద్ద ఎండిపోయిన మామిడాకులు, పువ్వులను గుర్తించి ఆలయ సిబ్బందిని మందలించారు.