దసరా ఉత్సవాలు ముగింపు సందర్బంగా అమ్మవారి విగ్రహాన్ని కోటిపల్లి గోదావరిలో నిమజ్జనం చేస్తుండగా ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కె. గంగవరం మండలం కోటిపల్లి రావి చెరువు గ్రామానికి చెందిన మేడిశెట్టి వీర బ్రహ్మం (35), నరాల వేద మూర్తి (30) లు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈత గాళ్ళతో గాలిస్తున్నారు.