శివనామస్మరాలతో మారుమోగిన దేవాలయాలు

1539చూసినవారు
మహాశివరాత్రి పురస్కరించుకుని గంగవరం మండలం కోటిపల్లి, రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామాలకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. కోటిపల్లి శ్రీ రాజ రాజేశ్వరి సమేత శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయం, ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామీ వారి ఆలయాలు భక్తులతో కిట కిట లాడాయి.

తెల్లవారుజాము నుంచి భక్తులు కోటిపల్లి లో గల గౌతమి గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని, శ్రీ రాజ రాజేశ్వరి అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అదేవిదంగా ద్రాక్షారామ సప్త గోదావరి లో స్నానమాచరించి శ్రీ భీమేశ్వర స్వామి వారిని, శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

కోటిపల్లి, ద్రాక్షారామ గ్రామాలు శివన్నామ స్మరణ తో మారు మొగాయి. తెల్లవారుజాము నుంచిక్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు.
కోటిపల్లి రేవులో గల స్నాన ఘట్టాలు వద్ద గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. వాహనాలు రాక పోకలకు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్