ప్రతీ ఉపాధి కూలికి రోజుకి రూ. 300గరిష్ట కూలి వచ్చేలా ఉపాధి సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ విశ్వనాధ్.. సిబ్బంది ని ఆదేశించారు. మారేడుమిల్లి మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 100 ఫార్మ్ పాండ్స్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. 30 ఆంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలన్నారు.