అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలోని పుల్లంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేశామని డిఎస్పీ సాయిప్రశాంత్ తెలిపారు. ఎస్. గంగిరెడ్డి వి. వీరయ్యలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి మందు పాతరకు వినియోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీరు గతంలో మావోయిస్టులకు బియ్యం నిత్యావసర సరకులు కూడా సరఫరా చేసినట్లు గుర్తించామన్నారు.