రంపచోడవరం గురుకుల బాలికల కళాశాలను రంపచోడవరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులు తాగునీరు, బాత్రూంలలో రన్నింగ్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నామని తెలపడంతో వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. పారిశుద్ధ్యం, విద్యార్థులకు అందజేసే భోజనం చూసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి భారీగా నిధులు ఖర్చు చేస్తుందన్నారు.