రంప: బాల్య వివాహలను అరికట్టండి

51చూసినవారు
రంప: బాల్య వివాహలను అరికట్టండి
ఏజెన్సీలో బాల్య వివాహాలను అరికట్టడానికి అందరూ కృషి చేయాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ అన్నారు. రంపచోడవరంలో ఆమె వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో బాల్య వివాహాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే 100, 109, 1098 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్