గర్భిణీలకు, బాలింతలకు, చిన్నరులకు పోష్టికాహారం అందించాలంటే ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు ఉండాలన్నారు. రంపచోడవరం మండలంలోని జగమెట్ల గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి అంగన్వాడీ భవనమే లేదు. అప్పుడు ఉన్న భవనం పడిపోవడంతో అధికారులు వారిని గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో ఉండమని చెప్పారు. అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.