బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఉదయం రాజోలు మండలంలోని రాజోలు, శివకోడు గ్రామాల్లో జోరుగా వర్షం కురిసింది. ఉదయం నుండి వాతావరణం మేఘాలు మబ్బులతో ఉండి వర్షం కురవడంతో సార్వ పంట సాగుచేసిన రైతులలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం పంట చేతికి అందివచ్చే దశలో ఉండగా. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిస్తే పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులంటున్నారు.