మలికిపురం: ఆకట్టుకుంటున్న సంగీత్ చిత్రం

76చూసినవారు
మలికిపురం: ఆకట్టుకుంటున్న సంగీత్ చిత్రం
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మలికిపురానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సంగీత్ సోమవారం అద్భుతమైన చిత్రాలతో నివాళులర్పించారు. విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరిస్తూ గీసిన చిత్రం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. పోలీసుల విధులు, వారి ఆత్మ త్యాగాన్ని ప్రజలకు వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకు వచ్చేందుకు ఈ చిత్రాన్ని గీశానని చిత్రకారుడు సంగీత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్