గుంటూరులో జరిగిన మాలల సింహగర్జన సదస్సు విజయవంతం అయ్యేందుకు సహకరించిన మాజీ మంత్రి గొల్లపల్లికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని మాల మహానాడు నేతలు తెలిపారు. మలికిపురంలో మాజీ మంత్రి గొల్లపల్లిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సింహగర్జన సదస్సుకు తరలి వెళ్ళిన మాలలకు సంపూర్ణ సహకారం అందించారని అభినందించారు. కార్యక్రమంలో వెంకటపతి, శ్రీనివాస్, మనిరాజు, శ్రీహర్ష, సత్తిబాబు, కుమార్ పాల్గొన్నారు.