ఎన్నికల్లో ఎన్డీఏ నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు. మలికిపురం మండలం మలికిపురం వైసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన రాజోలు మండల గ్రామ శాఖ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని వేధిస్తున్నారని గొల్లపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.