మలికిపురంలో భారీగా మోహరించిన పోలీసులు

50చూసినవారు
మలికిపురం కళాశాలలో పనిచేస్తున్న 28 మంది అన్ ఎయిడెడ్ అధ్యాపకులను విధుల నుంచి తొలగించడంతో శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. 51 రోజులు రిలే నిరాహార దీక్షల అనంతరం అధ్యాపకులకు పెండింగ్ వేతనాలను యాజమాన్యం చెల్లించింది. కానీ వారిని విధుల నుంచి తొలగించింది. దీంతో అన్ ఎయిడెడ్ అధ్యాపకులు ఆమరణ దీక్ష చేపడతామని చెప్పారు. వారికి పలువురు సంఘీభావం తెలిపారు. దీంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్