ఈ నెల 6వ తేదీన రాజోలు మండలం శివకోటి మంగిన గంగయ్య తెలగా కళ్యాణ మండపంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో అర్హుల గుర్తింపు శిబిరం జరుగుతుందని రాజోలు మండల పరిషత్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఆరవ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ శిబిరం జరుగుతుందని తెలిపారు.