ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తాను ఎప్పుడు ముందుంటానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆయన రాజోలు మండలం తాటిపాకలో నిర్వహించిన రాజోలు తాలూకా శెట్టిబలిజ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. అమలాపురంలో ఈనెల 24వ తేదీన నిర్వహించే శెట్టిబలిజ కార్తీక వన సమారాధన విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.