సఖినేటిపల్లి: నరసింహ స్వామికి జన్మ నక్షత్రం పూజలు

78చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా శుక్రవారం 18 కలశలతో విశ్వ అభిషేకం, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలతో అర్చక స్వాములు ఈ పూజా కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు జన్మ నక్షత్రం పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో సత్యనారాయణ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్