కాకినాడ జిల్లా తుని మండలంలో మంగళవారం నాడు వేకువ జామున 5 గంటల నుండి సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పెన్షన్ దారులుకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ ఒకరోజు ముందుగ రావడంతో లబ్ధిదారులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.