తుని: దేవస్థానంలో జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు

82చూసినవారు
తుని: దేవస్థానంలో జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు
ప్రముఖ పుణ్య క్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానంలో జూదం నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు అన్నారు. లోవ దేవస్థానంలో జూదం నిర్వహిస్తున్న 11 మందిని గుర్తించి వారికి రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు, సీఐ చెన్నకేశవరావు శనివారం కౌన్సెలింగ్ ఇచ్చి, హెచ్చరించారు. జూదం నిర్వహిస్తే ప్రత్యేక చట్టాల ద్వారా పీడీ యాక్ట్ నమోదు చేసి, రూ. 5 లక్షల వరకు జరిమానా విధిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్