అడ్డతీగల: ఇసుక లోడ్ చేస్తూ.. నలుగురు యువకులు గల్లంతు
అల్లూరి జిల్లా అడ్డతీగల మండలంలోని తిమ్మాపురం గ్రామంలో కొండవాగులో ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేస్తుండగా నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం వాసులుగా గుర్తించారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్, గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.