ఐ.. పోలవరం: మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసులు చోరీ
ఐ. పోలవరం మండలంలోని మురమళ్లలో ఓ ఫంక్షన్ కు వెళ్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును ఓ వ్యక్తి అపహరించాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనంపై వెంబడిస్తూ వచ్చిన వ్యక్తి ఉన్న సుమారు రూ. 5లక్షలు విలువ చేసే రెండు బంగారు గొలుసులు లాక్కుని పరారైనట్లు తెలిపారు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.