కోలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన అజిత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. రేస్ పోటీలు పూర్తయ్యేవరకు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు వెల్లడించాడు. అజిత్ ప్రాక్టీస్ చేస్తున్న కార్ రేస్ ఈ నెల జనవరి 12న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రాక్టీస్ రేస్‌లో భాగంగా అజిత్ నడుపుతున్న కారు యాక్సిడెంట్ కూడా అయ్యింది. ఈ ప్రమాదంలో అజిత్ బయట పడ్డాడు. ఈ క్రమంలోనే తన నిర్ణయాన్ని తాజాగా వెల్లడించాడు.