సంక్రాంతి పండుగ వేళ విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి వల్ల ట్రాఫిక్ భాగా తగ్గింది. ఈ మార్గం ద్వారా గన్నవరం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను విజయవాడలోకి రానీయకుండా పోలీసులు గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్దే దారి మళ్లిస్తున్నారు. దారి మళ్లింపుతో దాదాపు 30 కి.మీ వరకు దూరం తగ్గిందని, ఇంధనం ఆదా అవుతోందని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.