AP: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం బోనుపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి నీటికుంటలోకి దూసుకెళ్లింది. శ్రీకాళహస్తి నుంచి బోనుపల్లి గ్రామానికి వెళ్తోన్న ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న నీటికుంటలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.