సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం మున్సిపాలిటీ లోని వార్డు నెంబర్ 1 లో రూ. 25 లక్షలతో సీసీ రోడ్లు, 12 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.