రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాకు ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ఉత్తర్వులు ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించింది.