వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి, వడ్డే ఓబన్న 209 వ జయంతి వేడుకలను శనివారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ పుట్టపాక మహేశ్, ఇతర కాంగ్రెస్ నాయకులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చీరల విజయ్ చందర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కృష్ణయ్య ఇతర నేతలు పాల్గొన్నారు.