అలరించిన నృత్యాలు
ఆనంద నర్తనోత్సవం-3 కార్యక్రమం మండపేట స్థానిక సూర్యా ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు. మండ పేట, విజయవాడ, విశాఖపట్నం, గుడివాడ, అశ్వారావు పేట, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం, జానపదనృత్య ప్రదర్శన చేపట్టారు. నిర్వాహకులు గిరిజ, సంపత్ ఆధ్వర్యంలో జరిగిన నృత్య రూపకాలు ఆద్యంతం అలరించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సురుచి ఫుడ్స్ అధినేత మల్లి బాబు, ఐఎ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఇనపకోళ్ల సత్యనారాయణ, పారిశ్రామికవేత్త కొనగళ్ల విశ్వనాథం, బిక్కిన చిన్న తదితరులు పాల్గొని ఉత్తమ ప్రదర్శన చేసిన కళాకారులకు జ్ఞాపికలు అందజేశారు.