టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే

58చూసినవారు
టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే
టీ20 క్రికెట్‌లో జింబాబ్వే ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (133; 43 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్స్‌లు) రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే జింబాబ్వే తరఫున ఇంటెర్నేషనల్ టీ20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

సంబంధిత పోస్ట్