ఆయిల్‌ ట్యాంకర్‌లో బీర్‌ బాటిల్స్! (వైరల్ వీడియో)

65చూసినవారు
బీహార్‌లోని బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్‌లో మద్యం బాటిళ్లతో పాటు బీరు బాక్సులను అక్రమంగా తరలిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్యాంకర్‌ను పట్టుకున్నారు. అనంతరం హైవేపై ట్యాంకర్‌ను వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. ట్యాంకర్‌లో దాదాపు 200 బీరు డబ్బాలు ఉన్నట్లు సమాచారం. మద్యం మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్