ముమ్మిడివరం: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహంతుల్లా సూచించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. హెచ్ఎం హనుమంతరావు అధ్యక్షతన చిల్డ్రన్స్ డే వేడుకలు జరిగాయి.