Sep 13, 2024, 03:09 IST/వనపర్తి
వనపర్తి
విద్యతో పాటు దేహదారుడ్యం ముఖ్యం: తూడి మేఘారెడ్డి
Sep 13, 2024, 03:09 IST
విద్యతో పాటు దేహదారుడ్యం ముఖ్యమని దేశదారుడ్యం క్రీడలతో సాధ్యమవుతుందని, విద్యార్థులు క్రీడలపై దృష్టిని సారించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం గోపాల్ పేట మండలం బుద్ధారం ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో గదులు శిథిలావస్థలో ఉన్నాయని నూతన తరగతి గదుల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే, కలెక్టర్ కు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు.