వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై రేవతి అన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని సమీకృత మార్కెట్ సముదాయం వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. పెండింగ్ చలాన్ లు పరిశీలించి వాహనదారుల చేత వాటిని కట్టించారు. వాహనాల పత్రాలు, నంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానాలు విధించారు. పెండింగ్లో ఉన్న వాహన చలాన్ లను తప్పని సరిగా చెల్లించాలని అన్నారు. తనిఖీల్లో ఏఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.