డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరు అరెస్టు: ఎస్సై
సఖినేటిపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని సఖినేటిపల్లి ఎస్సై దుర్గా శ్రీనివాస్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని, కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.