తుని: ఘనంగా నాగుల చవితి వేడుకలు
తుని మండలంలో నాగుల చవితి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండలంలో అన్నీ గ్రామాల్లో కుడా పుట్టల దగ్గర భక్తులూ చిమ్మిడి, చలిమిడి, గుడ్లు, పాలు, నాగేంద్ర స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా పుట్టలు తగ్గిపోయాయని, ఇప్పుడు పూర్తిగా లేవని ప్రజలు వాపోతున్నారు. పుట్టలు లేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పూజలు చేసుకోవలసిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.