పోడూరు మండల గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షునిగా ఎస్బిఎస్ఎస్ కుమార్ (పండిత విల్లూరు విఆర్ఓ) ఎన్నికయ్యారు. పొడూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన మండల గ్రామ రెవెన్యూ అధికారుల సమావేశంలో మండల విఆర్ఒల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ఆర్ఐకె రాంబాబు, వీఆర్వోలు అభినందించారు.