పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గన్నాబత్తుల నాగేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్దనుండి 8 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని తణుకు ఎక్సైజ్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.