పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో కొలువైఉన్న శ్రీ అయ్యప్పస్వామి వారి ఆలయ 19వ వార్షికోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. మార్టేరు, నెగ్గిపూడి, వెలగలేరు, వనంపల్లి, పెనుమంట్ర తదితర గ్రామల ప్రజలు స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామి వారికి వేకువజామునుంచే విశేషంగా పూజలు, అభిషేకాలు నిర్వహించడం తోపాటు ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం నిర్వహించారు.