ఘంటసాల మండలం దాలిపర్రు, యందుకుదురు, లంకపల్లి పూషడం, వి. రుద్రవరం, చిలకలపూడి, చిట్టూరు, దేవరకోట గ్రామాల గుండా ప్రవహిస్తున్న భీమా నది ఛానల్ కింద సాగులో ఉన్న శివారు సాగు భూములకు నీటి సరఫరా చేయుటకు గాను ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తూములను మూసి వేయుట జరుగుతుందని ఘంటసాల తహసీల్దార్ బి. విజయప్రసాద్ శుక్రవారం తెలియజేశారు. కావున సదరు గ్రామాల్లో తూములను తెరవ రాదని, రైతులు సహకరించాలన్నారు.