కేంద్రమంత్రి అమిత్ షాను తన మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భీమవరం పట్టణంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.