ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భీమడోలు, ముదునూరుపాడు, నరసాపురం, తణుకు, పాలకొల్లు, భీమవరం, కవిటం, గోటేరు, పోడూరు, ఆచంట తదితర ప్రాంతాల చర్చిలలో క్రీస్తు సందేశం తెలియజేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాత్రి 12 గంటలకు ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.