ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలని, ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం భీమవరం పట్టణం 7వ వార్డు గాంధీనగర్ కు చెందిన నిమ్మకాయల భాస్కర్, హేమ నాగ దుర్గ దంపతుల కుమారుడు, కుమార్తె నిమ్మకాయల సుబ్రహ్మణ్యం(9వ తరగతి), నిమ్మకాయల పార్ధు (6వ తరగతి)ల చదువు నిమిత్తం దాతల సహకారంతో రూ. 10 వేలు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు.