భీమవరం ప్రొహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 40 దుకాణాలకు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ సోమవారం ముగిసింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఈ లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. భీమవరం స్టేషన్ పరిధిలోని మొత్తం 40 మద్యం దుకాణాలకు గాను 1287 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈనెల 16 నుంచి షాపులను ప్రారంభించాల్సి ఉంటుంది.