ఏలూరు జిల్లా చింతలపూడి మండలం స్థానిక మండలంలోని 30 మంది విద్యార్థులకు ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ శనివారం నోట్ బుక్స్ పంపిణీ చేసింది. పాఠశాలలు మొదలు అవుతున్న నేపథ్యంలో పిల్లలకు ఆసరాగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఎజ్రా శాస్త్రి పుట్టినరోజు సంధర్భంగా ఈ కార్యక్రమం చేసినట్టు ఆ సంస్థ అధినేత రవి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రవితో పాటుగా ఆయన టీమ్ సభ్యులు పాల్గొన్నారు.