నా ఆరోగ్యం గురించి ఆందోళన లేదు

72చూసినవారు
విజయవాడలో నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ. పరిస్థితి అదుపులోకి వస్తుందని, బాధితులు ధైర్యంగా ఉండాలని సూచించారు. నిన్న ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండటంతో కొంత నలతగా అనిపించిందని, తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. తన నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానానికి వెలకట్టలేనని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్