చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం శివారు తమ్మిలేరు జలాశయానికి ఇన్‌ఫ్లో 1648, అవుట్ ఫ్లో 445 క్యూసెక్కులుగా ఉన్నట్లు ఏఈ పరమానందం ఆదివారం తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 355 అడుగులు కాగా. ప్రస్తుతం తమ్మిలేరు బేసిన్‌లో 347. 72 అడుగుల మేర నీరు ఉందన్నారు. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1. 774 టీఎంసీలుగా ఉందన్నారు.