పెదపాడులో సిపిఎం నేతలు నిరసన..

73చూసినవారు
పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పెదపాడులోని బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్