దెందులూరు నియోజకవర్గంలోని గ్రామీణ స్థాయిలోని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని ఉచితంగా అందించి వారి సొంత ఇంటికలను సాకారం చేయడానికి చర్యలు చేపట్టినట్టు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, అధికారులు ఎమ్మెల్యేను కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలను తెలియజేశారు.